Wednesday, October 22, 2008

విశాలమైన నేత్రాలపై చీకటిని ఆరబోస్తున్న కాటుకతో నా మనసులో గూడు కట్టు కున్న సంధ్య అంటే నా కిష్టం
ఎర్రని సూర్యబింబాన్ని నుదిటిపై సిందురంగా సింగారించుకుని చల్లగా వీచే పిల్ల గాలులతో కబుర్లు చెబుతూ నా చెంతకు వచ్చే సంధ్య అంటే నాకిష్టం .....
పచ్చని చేలలో పసిడి హృదయాలు జలకాలడుతుంటే వీక్షించి వర్ణనాతీతంగా నాకు వివరించే సంధ్య అంటే నాకుఇష్టం రేపనే భవిష్యత్ కు స్వాగతం చెబుతూ ...నేడు నన్ను అలరిస్తూ ప్రతి రోజు గుమ్మం దగ్గరికొచ్చి వీడ్కోలు చెప్పే సంధ్య అంటే నాకు ఇష్టం ...
ఈ జీవిత ప్రయాణం లో నా గమ్యం చేరేంతవరకు ....తన సంధ్యా కిరణాలతో ప్రసరింప జేస్తూ ....
నా లోని ఆత్మ విశ్వాసాన్ని మరింతగా పెంచుతున్న నా సంధ్య అంటే నాకు ఇష్టం .....



రాజు .....9908768187

No comments: