Wednesday, October 22, 2008

పచ్చని పచ్చిక పోత్తిళ్ళపై పసి మంచు లేత అరుణ కిరణాల తాకిడికి ...
ముత్యం లాగా మారి ప్రకృతి అందాలు పురిపిప్పినట్టు
నిండు పున్నమి రేయి చంద్రుని వన్నెలతో ...!
పుడమి జలతారు వన్నెగా మారి నవ్య కాంతులతో మెరిసినట్లు..
నా జీవితంలోని లోని వలపుకు మెరుపువు నీవై ,,,
మన ఇద్దరి ప్రేమకు ఓ సరికొత్త నిర్వచనాన్ని అందిస్తావన్న ఆశతో ......

నీ రాజు 9908768187
చిగురులు వేయని ఎడారిలో
చిరునవ్వుల పువ్వులు కావాలి..
చిరుజల్లుల తడితో పెను మంటలను ఆర్పే చల్లని మాటలు కావాలి ...!
ఘనీభవించిన మది కడలి మంచు కాలవలై పారాలి..
నీతో ప్రేమ జన్మ జన్మ లకు నిండువెలుగులను నింపాలి...!
స్వార్ధం లేని ప్రేమ మన ఇద్ధరిదనే సంతృప్తి నాకు పంచాలి...!
రాజు 9908768187

మంచు పరదాల మాటున ...

వెన్నెల కిరణాల చాటున ...

రుతువుల కతీతంగా ...

సృష్టికి వ్యతిరేకంగా

ఈ ప్రపంచాన్ని ఈ కట్టుబాట్లను ..

వెలివేసి ఒకరికి ఒకరంగా

మిగిలిపోదాం చెలి,,,,

RAJU9908768187

చీకటి లోనుండి నలుపుని ...
శ్వాసలోనుండి వెచ్చదనాన్ని ...
జాబిల్లిలోనుండి వెన్నెలని ...
సముద్రం నుండి అలలను ...
అలాగే !! నా నుండి నిన్ను ఎవరైనా వేరుపర్చగలరా....
రాజు 9908768187
అద్దాల చెక్కిట చేయి చేర్చి ...
తలపుల తలుపుకు నడిమిచ్చి ...
తెల్ల గుర్రం మీద రాబోయే రాకుమారుడి కోసం
రెప్పలైన వాల్చకుండా ఎదురుచూస్తుంటావని ,,,,
చిరుగాలి సవ్వడికి సైతం వులుకి పడుతుంటే ...
ముకం దాచుకుని సిగ్గుతో కలలు కంటూ ఉంటావని ....

రాజు 9908768187
నీ కళ్లు ...
అవి వెలిగించిన వలపు నెగళ్లు...
తెరవని నీ మది వాకిళ్ళు ...కావటే
అవి వెన్నెల చివాళ్ళు ,,
నా పాలిట అవి వేయని సంకెళ్ళు...
వెంటాడునవి నన్ను రేయింబవళ్ళు..
నాలో కలిగించునవి దిగుళ్ళు...
అవి సుతి మెత్తని ముళ్ళు ..
అచ్చట రవ్వల రాసిల్లు ....
నీ మరువలేను వెయ్యేళ్ళు,,,,

రాజు 9908768187
విశాలమైన నేత్రాలపై చీకటిని ఆరబోస్తున్న కాటుకతో నా మనసులో గూడు కట్టు కున్న సంధ్య అంటే నా కిష్టం
ఎర్రని సూర్యబింబాన్ని నుదిటిపై సిందురంగా సింగారించుకుని చల్లగా వీచే పిల్ల గాలులతో కబుర్లు చెబుతూ నా చెంతకు వచ్చే సంధ్య అంటే నాకిష్టం .....
పచ్చని చేలలో పసిడి హృదయాలు జలకాలడుతుంటే వీక్షించి వర్ణనాతీతంగా నాకు వివరించే సంధ్య అంటే నాకుఇష్టం రేపనే భవిష్యత్ కు స్వాగతం చెబుతూ ...నేడు నన్ను అలరిస్తూ ప్రతి రోజు గుమ్మం దగ్గరికొచ్చి వీడ్కోలు చెప్పే సంధ్య అంటే నాకు ఇష్టం ...
ఈ జీవిత ప్రయాణం లో నా గమ్యం చేరేంతవరకు ....తన సంధ్యా కిరణాలతో ప్రసరింప జేస్తూ ....
నా లోని ఆత్మ విశ్వాసాన్ని మరింతగా పెంచుతున్న నా సంధ్య అంటే నాకు ఇష్టం .....



రాజు .....9908768187